సుల్తాన్‌బజార్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇన్ స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉస్మానియా దవాఖాన ఆటోస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (50) మృతదేహం ఉన్నట్లు గుర్తించి స్థానికులు అందించిన సమాచారం మేరకు అఫ్జల్‌గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కాగా మృతుడి ఒంటిపై బ్లూ కలర్ షర్టు,డార్క్ బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.