సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 12:52:56

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన వృద్ధురాలు.. రక్షించిన ఎస్‌ఐ

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన వృద్ధురాలు.. రక్షించిన ఎస్‌ఐ

ఉడిపి : కర్ణాటక రాష్ర్టం ఉడిపి సమీపంలోని కుక్కికట్టేలో తన ఇంటి సమీపంలోని బావిలో ఓ వృద్ధురాలు గురువారం ప్రమాదవశాత్తు పడిపోయింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఫైర్‌ అండ్‌ రెస్క్యూ పర్సనల్‌, పోలీసులకు సమాచారం అందజేశారు. ఉడిపి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సదాశివ గోవ్రోజి తన సిబ్బందితో హుటూహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో ఇద్దరితో కలిసి ఎస్‌ఐ స్వయంగా బావిలోకి దిగి వృద్ధురాలిని సురక్షితంగా బయటికి తీశారు. ఎస్‌ఐతో పాటు బావిలో దిగిన వారిలో ఫైర్ అండ్ రెస్క్యూ స్టాఫ్ వినాయక్‌, స్థానిక ఆటో డ్రైవర్ రాజేశ్‌ నాయక్‌ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో తోటి సిబ్బందితో పాటు ప్రజలు ఎస్‌ఐను అభినందిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo