ఏఐ టెక్నాలజీని స్కామర్లు దుర్వినియోగం చేస్తున్నారు. స్పానిష్ టౌన్లో స్ధానిక బాలికల (AI Generated Images) ఏఐ జనరేటెడ్ నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అల్మెండ్రలెజో పట్టణానికి చెందిన 11 నుంచి 17 ఏండ్ల బాలికల నగ్న చిత్రాలు వారి అనుమతి లేకుండా సోషల్ మీడియా వేదికలపై సర్క్యులేట్ అవుతున్నాయి. 20, 30 మంది బాలికలు ఈ ఘటనలో బాధితులుగా ఉన్నారని చెబుతున్నారు.
మార్ఫ్డ్ చిత్రాలు నిజమైనవే అన్నట్టుగా ఉన్నాయని బాధితురాళ్లలో ఒకరి తల్లి డాక్టర్ మిరియం అల్ అదిబ్ ఇన్స్టాగ్రాం వీడియోలో పేర్కొన్నారు. నా కూతురి శరీరం గురించి నాకు తెలియకుంటే ఈ ఫొటో రియల్‌గానే కనిపిస్తోంది. మీరు (నిందితులు) చేస్తున్న నష్టం గురించి మీకు తెలియదు..ఇలాంటి అశ్లీల మెటీరియల్ కోసం ఇమేజ్‌లను ఉపయోగించడం, వాటిని వ్యాప్తి చేయడం తీవ్ర నేరమని ఆమె పేర్కొన్నారు.
బాలికలు ఇలాంటి వాటి గురించి భయపడకుండా బయటకు చెప్పాలని, మీ తల్లులకు చెప్పాలని ఆమె కోరారు. 11 మంది మైనర్ బాలికల నుంచి ఫిర్యాదులు రాగా స్ధానిక అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. బాలికల నగ్న చిత్రాల ఇమేజ్‌లను తయారుచేసి వాటిని వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్‌లో సర్క్యులేట్ చేసిన ఘటన వెనుక 11 మంది స్ధానిక బాలురు ఉన్నట్టు గుర్తించారు. ఇతర మహిళల శరీరాలపై అమాయక మైనర్ బాలికల ముఖాల ఇమేజ్‌లను ఇంపోజ్ చేస్తున్నారని స్ధానిక పోలీసులు వెల్లడించారు.
Read More
Canadian citizenship | గడిచిన ఐదేళ్లలో 1.6 లక్షల మందికి కెనడా పౌరసత్వం