మద్యం మత్తులో బుగ్గ కొరికిన భర్త.. కేకలు వేసిన భార్య
హైదరాబాద్ : ఓ భర్త పీకల దాకా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాడు. తన భార్యతో సరదాగా ఉందామనుకున్నాడు. ఇంకేముంది.. భార్య బుగ్గను గట్టిగా కొరికేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. తన బుగ్గను కొరికిన భర్తపై కేసు నమోదు చేయాలంటూ.. ఆమె పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ఈ విచిత్రమైన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలోని కానూరు కేసీపీ కాలనీలో చోటు చేసుకుంది.
కేసీపీ కాలనీకి చెందిన స్రవంతి, రాంబాబు భార్యాభర్తలు. రాంబాబు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తుండగా, భార్య ఇంటి దగ్గరే ఉంటుంది. రాంబాబు మద్యానికి బానిస అయ్యాడు. ప్రతి రోజు పీకల దాకా మద్యం సేవించి, భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా సెక్యూరిటీ గార్డ్ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో భార్య బుగ్గ కొరికాడు. దీంతో ఆమె కేకలు వేసింది. చెంపకు తీవ్ర గాయం కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తన భర్త బుగ్గ కొరికాడని, కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆవిడ ఫిర్యాదును చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఎంతకీ వినకపోవడంతో కేసు నమోదు చేయక తప్పలేదు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

