నలందాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
నలందా| బీహార్‌లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలందాలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో

పట్నా: బీహార్‌లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలందాలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఘోటల్ సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జహనాబాద్ జిల్లా నుంచి వస్తున్న ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారని చెప్పారు.
ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రోడ్డుప్రమాద ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు వెంటనే సాయం అందిచాలని అధికారులను ఆదేశించారు. మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Bihar
- CM Nitish Kumar
- Hotel
- Nalanda
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

