మధుర : ఉత్తరప్రదేశ్లోని యమునా ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధుర జిల్లా సురిర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎక్స్ప్రెస్ వే 87వ మైలురాయి వద్ద శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండుకార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కార్లు ఢీకొట్టుకున్న అనంతరం మంటలు చెలరేగడంతో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మధుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.