రైలు కిందపడి ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య..!
Sisters suicide: వాళ్లు 16, 14, 11 ఏండ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెండ్లు. వారితోడ సోదరుడు గణేష్ ఉన్నాడు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితమే మరణించడం, తల్లికి మూడేండ్ల క్రితం కండ్లు పోవడంతో

జాన్పూర్: వాళ్లు 16, 14, 11 ఏండ్ల వయసున్న ముగ్గురు అక్కాచెల్లెండ్లు. వారితోడ సోదరుడు గణేష్ ఉన్నాడు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితమే మరణించడం, తల్లికి మూడేండ్ల క్రితం కండ్లు పోవడంతో ఆ పిల్లలు నరకయాతన అనుభవిస్తున్నారు. నలుగురు పిల్లలు కలిసి దొరికిన పనల్లా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ముగ్గురు అక్కాచెల్లెండ్లు ప్రీతి (16), కాజల్ (14), ఆర్తి (11) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం రాత్రి ఒకేసారి వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పూర్ జిల్లా బద్లాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఫట్టుపూర్ దగ్గర సుల్తాన్పూర్ రైల్వే క్రాసింగ్పై జన్సాధారణ్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి వాళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కటిక పేదరికంతో విసిగిపోవడమే ఆ పిల్లల ఆత్మహత్యలకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గత సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు రాత్రి 11 గంటలకు ఫట్టుపూర్ దగ్గర విగతజీవులుగా మారారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

