గురువారం 02 జూలై 2020
Crime - May 28, 2020 , 16:41:51

భారత సంతతి వ్యక్తులకు 34 ఏండ్ల జైలుశిక్ష

భారత సంతతి వ్యక్తులకు 34 ఏండ్ల జైలుశిక్ష

లండన్‌: బ్రిటన్‌లో డ్రగ్స్‌ సరఫరాల చేస్తూ పట్టుబడిని ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు లండన్‌ కోర్టు 34 ఏండ్ల జైలుశిక్ష విధించింది. బ్రిటన్‌ చరిత్రలోనే ఇదే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత అని, దీని విలువ దాదాపు 20 మిలియన్‌ పౌండ్స్‌ (భారతీయ కరెన్సీలో రూ. 185,62,70,240.40) ఉంటుందని పోలీసులు చెప్పారు. బర్మింగ్‌హామ్‌లో నివసించే శక్తిగుప్తా (34), ఓల్డ్‌బరీకి చెందిన బల్‌దేవ్‌ సింగ్‌ సహోతా (54) అనే ఇద్దరి వద్ద 172 కిలోల కొకైన్‌ పట్టుబడింది. ఇప్పటివరకు ఇదే బ్రిటన్‌లో పట్టబడిన అతిపెద్ద డ్రగ్‌ అని డిటెక్టివ్‌ సూపరింటెండెంట్ నీల్‌ బల్లార్డ్‌ చెప్పారు. 

గత ఏడాది డిసెంబర్‌ 11వ  తేదీన డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన పక్కా సమాచారం మేరకు..  వెస్ట్‌ మిడ్‌లాండ్‌ పోలీసులతో కలిసి అధికారులు చేపట్టిన వాహనాల తనిఖీలో కొకైన్‌ పట్టబడింది. వాహనంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 168 కిలోల కొకైన్‌ స్వాధీనం చేసుకొన్నామని, వారిచ్చిన సమాచారంతో మరో 4 కిలోల డ్రగ్ స్వాధీనపర్చుకొన్నట్టు మెట్రోపాలిటన్‌ పోలీస్‌ స్పెషలిస్ట్‌ అయిన నీల్‌ తెలిపారు. అనంతరం వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి అభియోగాలను మోపగా.. వాటిని విచారించిన లండన్‌ కోర్టుకు వారిలో ఒకరికి 18, మరొకరికి 16 ఏండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 


logo