Fire accident | విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మిఠాయి దుకాణం దగ్ధం

కవాడిగూడ : భోలక్‌పూర్ డివిజన్ బాకారం మెయిన్ రోడ్డులో గల ఓ స్వీట్ దుకాణం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. రాంరతన్ అనే వ్యాపారి బాకారంలో శ్రీ బాలాజీ రాంరతన్ మిఠాయి బండార్ పేరిట దుకాణాన్ని నిర్వహిస్తు న్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు. గురువారం తెల్లవారు జామున 4 గంటలకు దుకాణం నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి దుకాణం బోర్డుపై ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
రాంరతన్ దుకాణం వద్దకు వచ్చి వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు . వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే దుకాణంలో ఉన్న సామాగ్రి కాలిబూడిదైంది. సుమారు రూ. 10 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని రాంరతన్ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్ వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

