కావలసిన పదార్థాలు
తురిమిన క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, ఉడికించిన ఆలుగడ్డ: ఒకటి, ఉడికించిన స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీ: టేబుల్ స్పూన్ చొప్పున, పనీర్ తురుము: రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్, మిరియాల పొడి, చిల్లీఫ్లేక్స్, ఆరిగానో, చాట్ మసాలా: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, బ్రెడ్‌క్రంబ్స్: ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్, మైదా: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో క్యారెట్, క్యాబేజీ, బీన్స్, క్యాప్సికం తురుము, మెదిపిన ఆలూ, స్వీట్‌కార్న్, బఠాణీ, పనీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీఫ్లేక్స్, ఆరిగానో, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో అర కప్పు బ్రెడ్‌క్రంబ్స్ కూడా వేసి ముద్దలా కలిపి పక్కనపెట్టాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, కొద్దిగా ఉప్పు వేసి.. నీళ్లుపోసి జారుగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచెయ్యాలి. ముందుగా కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని బుల్లెట్స్‌లా చేసుకుని ముందు మైదా మిశ్రమంలో, ఆ తర్వాత బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించాలి. ఇలా చేసి పెట్టుకున్న వాటిని వేడి నూనెలో దోరగా కాల్చుకుంటే నగ్గెట్స్ సిద్ధం.