చిన్న క్యాప్సికం: పావుకిలో
ఆలుగడ్డలు: రెండు
శనగపిండి: రెండు స్పూన్లు
ఉప్పు: తగినంత
కారం: స్పూను
ధనియాలు- జీలకర్ర పొడి: ముప్పావు స్పూను
నూనె: రెండు టీస్పూన్లు
ముందుగా క్యాప్సికంను కడిగి సగానికి తరిగి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను బాగా ఉడికించి చెక్కు తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా మెదిపి అందులో శనగపిండి, ఉప్పు, కారం, ధనియాలు-జీలకర్ర పొడితో పాటు కొద్దిగా నూనె వేసి మిశ్రమంలా కలుపుకోవాలి. ఆ ముద్దను ఇందాక సగానికి తరిగి పెట్టుకున్న క్యాప్సికంలో కూరాలి.
ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి.. కొద్దిగా నూనె చిలకరించి, క్యాప్సికం ముక్కలకు మళ్లీ నూనె రాసి సన్నటి సెగ మీద రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మధ్యలో కాసేపు మూత పెడితే ముక్కలు బాగా ఉడుకుతాయి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా ప్రయత్నించొచ్చు. సులభంగా వెరైటీగా ఏమన్నా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వంటకం మంచి ఆప్షన్.