కొర్ర పిండి: ఒక కప్పు, మజ్జిగ: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చి మిర్చి: రెండు, అల్లం తురుము: ఒక టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఉప్పు: తగినంత.
ఒక గిన్నెలో కొర్ర పిండి వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్‌మీద గిన్నెపెట్టి నాలుగు కప్పుల నీళ్లుపోసి మరుగుతుంటే తగినంత ఉప్పు వేసి, పిండి మిశ్రమాన్ని పోస్తూ.. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఐదు నిమిషాలు మరిగించి దగ్గర పడ్డాక దించి కాస్త చల్లారనివ్వాలి. ఆ మిశ్రమంలో మజ్జిగ, జీలకర్ర పొడి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు,కొత్తిమీర వేసి బాగా కలుపుకొంటే చాలు.. కొర్ర అంబలి తయారైనట్టే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
butter brocoli recipe | బ్రకోలితో ఇలా రుచిగా వండుకోండి..
మామూలు పరాటా తిని బోర్ కొట్టిందా? ఇంట్లోనే జొన్న పారాటా ఇలా చేసుకోండి
పళ్లెంలో పచ్చని చిత్రం..చిత్రాన్నం!