ఖుషీ ఖుషీగా..ఖుబానీ కా మీఠా!
హైదరాబాద్ అంటే అనేకానేక సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం. ఉత్తరాది, దక్షిణాది.. తేడా లేకుండా అన్నిరకాల రుచులనూ అందిస్తుంది భాగ్యనగరం. ప్రాచీన వంటకాలైన దమ్ బిర్యానీ, తందూరి రోటీ, నాన్, గాజర్ కా హల్వా, ఖుబానీ కా మీఠా, కద్దూ కా ఖీర్.. వంటి నోరూరించే రుచుల సమాహారం హైదరాబాదీ థాలీ. నిజాం కాలంనాటి ప్రత్యేక వంటకాల్లో ఒకటైన ఖుబానీ కా మీఠా సంగతులేంటో ఈవారం చూద్దాం..

హైదరాబాద్.. అరబ్, పర్షియన్ వంటకాలకు కేరాఫ్ అడ్రస్. వందల ఏండ్లనాటి ప్రాచీన వంటకాలను నేటికీ అదే రుచితో, సరికొత్త హంగులు మేళవించి అందిస్తున్నది. హైదరాబాదీ భోజనం అంటే.. ఘాటైన దమ్ బిర్యానీతో మొదలు పెట్టి, తియ్యని మిఠాయితో ముగించడం. అది ఖుబానీ కా మీఠా అయితే మరీ సంతోషం.
ఆప్రికాట్స్ విదేశాల్లో పండే పంట కాబట్టి, ఈ వంటకం కూడా విదేశాలనుంచే దిగుమతి అయిందనేది చరిత్రకారుల మాట. ఎక్కడి నుంచి వస్తేనేం, హైదరాబాద్ స్పెషల్ మిఠాయిగా స్థిరపడిపోయింది. హైదరాబాద్‌లోని హోటళ్లలోనే కాదు, భోజన ప్రియుల ఇండ్లలోనూ తయారవుతున్నది.
ఖుబానీ (ఆప్రికాట్స్), చక్కెర, నీళ్లు.. మూడే మూడు పదార్థాలతో తయారవుతుందీ మిఠాయి. ఆప్రికాట్స్‌ను నానబెట్టి, గింజలు తీసి ఆ నీటిలోనే ఉడికించి, చక్కెర వేసి, దగ్గరపడేవరకు ఉంచితే చాలు.. వగరు, పులుపు, తీపి కలగలసిన ప్రత్యేక రుచితో ఖుబానీ కా మీఠా తయార్.
డ్రై ఫ్రూట్స్ అంటేనే పోషకాల నిధులు. అందులోనూ అచ్చంగా ఆప్రికాట్స్‌తో తయారైన ఈ మిఠాయిలో పోషకాలు అపారం. దీనిలో పుష్కలంగా లభించే విటమిన్-సి జీర్ణ, చర్మ సంబంధ సమస్యలను దూరం
చేస్తుంది. ఈ పండ్లలో ఉడకటం వల్ల చక్కెరలోని హానికారక గుణాలు నశిస్తాయని అంటారు. కాబట్టే, మధుమేహంతో బాధపడేవారు కూడా రుచి చూస్తారు.
ఆప్రికాట్స్ గింజలు బాదం గింజలను పోలి ఉంటాయి. పోషకాల్లోనూ బాదం గింజలకు తీసిపోవు. అందుకే ఆప్రికాట్స్ నానిన తర్వాత, లోపలి టెంకను పగులగొట్టి ఆ గింజలను మిఠాయిల అలంకరణకు ఉపయోగిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఓసారి ట్రై చేయండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

