Butter Milk Recipe | సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మజ్జిగను ఇలా టేస్టీగా చేసుకోండి
Butter Milk Recipe | మజ్జిగ తాగితే రోగాలు దరిచేరవన్నది ఆయుర్వేదం హామీ. మజ్జిగ రుచికరమైన పానీయమే కాదు, అత్యంత ఆరోగ్యదాయకం కూడా. అనేక వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. వాత సంబంధ రుగ్మతలను తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలు, పేగు వ్యాధులు, ఆకలి మందగించడం, రక్తహీనతకు మంచి ఔషధం కూడా.
కావలసిన పదార్థాలు
పెరుగు: పావు కప్పు, నీళ్లు: ఒక కప్పు, ఉప్పు: తగినంత, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్,
గార్నిష్ చేసుకోవడానికి సరిపడా పుదీనా ఆకులు, కొత్తిమీర, కరివేపాకు. కావాలనుకుంటే తురిమిన అల్లం/ శొంఠిపొడి కూడా చేర్చుకోవచ్చు.
తయారీ విధానం
పావు కప్పు పెరుగును ఒక పాత్రలో తీసుకోవాలి. దానికి ఒక కప్పు నీళ్లు కలపాలి. ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలిపి కవ్వంతో కానీ, హ్యాండ్ బ్లెండర్తో కానీ బాగా చిలకాలి. దానిని కొత్తిమీర, పుదీనా, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే.. మండే ఎండల్లో చల్లదనాన్ని ఇచ్చే సహజసిద్ధ పానీయం సిద్ధమైపోతుంది. మజ్జిగ తాగడానికి మధ్యాహ్న భోజన సమయమే ఉత్తమమైనదని అంటారు.
Read More :
“ఈ డ్రింక్స్ తీసుకుంటే వడదెబ్బ నుంచి బయటపడొచ్చు..!
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!”
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
“ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- Butter Milk
- cooking
- Health
- recipe
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

