కావలసిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు: అర కప్పు (అంగుళం పరిమాణంలో), ఉల్లిగడ్డ: ఒకటి, టమాట: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కీరదోస ముక్కలు: పావు కప్పు, క్యాప్సికం: ఒకటి, మిరియాల పొడి: అర టీస్పూన్, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా పైనాపిల్ ముక్కలను ఒక నిమిషంపాటు నూనె లేకుండా పెనంపై వేయించాలి. ఆ ముక్కలతోపాటు సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కీరదోస, టమాట, క్యాప్సికం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి. పైనుంచి కొత్తిమీర తురుము చల్లుకుంటే నోరూరించే పైనాపిల్ సలాడ్ సిద్ధం. ఇష్టపడేవాళ్లు దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు కూడా జతచేసుకోవచ్చు.