కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు, క్యారెట్: రెండు, బఠాణీలు: అర కప్పు బీన్స్: పది పదిహేను, ఆమ్చూర్: టీ స్పూన్ , గరం మసాలా పొడి: అర స్పూన్, కొత్తిమీర: అయిదారు రెబ్బలు, బ్రెడ్ స్లయిస్‌లు: ఆరు, ధనియాల పొడి: అర స్పూను, గరంమసాలా: పావు స్పూను, కారం: అర స్పూను, వెల్లుల్లి రెబ్బలు: రెండు మూడు, నూనె: టేబుల్ స్పూను, జీడిపప్పులు: ఐదారు, మిరియాలు: అర స్పూను, క్యారెట్, క్యాబేజీ, కీరా, క్యాప్సికం తరుగు: ఒక కప్పు, ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
ముందుగా ఆలుగడ్డలను ఉడికించి చెక్కు తీసుకోవాలి. క్యారెట్, బీన్స్‌లను కడిగి సన్నటి ముక్కలుగా తరిగి ఉడికించుకోవాలి. బఠాణీలను కూడా ఉడికించుకోవాలి. వాటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఆలుగడ్డలను మెత్తగా చిదిమి అందులో వేయాలి. మిక్సీ పట్టిన బఠాణీలు, ఇందాక ఉడికించి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను కూడా వేయాలి. దాంతో పాటు గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు కారం, కొద్దిగా పులుపు కావాలనుకుంటే ఆమ్చూర్ కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఇది ఒక మిక్డ్స్ వెజిటబుల్ కర్రీలా
ఇప్పుడు ఈ ముద్దని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ైస్లెస్లను చుట్టూ కత్తిరించి, కొద్దిగా ఉప్పు నీళ్లలో ముంచి వెంటనే తీసి పిండి పక్కకు పెట్టాలి. ఆ బ్రెడ్ ముక్కల మీద ఇందాక తయారు చేసుకున్న మిక్డ్స్ వెజిటబుల్ కర్రీని గుండ్రటి ముద్దలుగా చేసి పెట్టి అన్ని వైపులా బ్రెడ్ వచ్చేలా మూయాలి. ఈ రోల్స్‌ను ఫ్రిజ్‌లో రెండు మూడు గంటల పాటు ఉంచాలి. తర్వాత తీసి ఎయిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా నూనెలో వేయించుకోవచ్చు.
వీటిలోకి నంజుకోవడానికి క్యాబేజ్ కాజు సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. అందుకోసం సన్నగా పొడవుగా తరిగిన కీరా, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికంలను ముందుగా వేడినీళ్లలో వేసి వెంటనే తీసి ఐస్ నీళ్లలో వేసుకోవాలి. దీనివల్ల ముక్కలు కరకరలాడుతాయి. ఇప్పుడు ఇందులోకి సాస్ చేసుకోవాలి. దానికోసం రెండు గంటలు నానబెట్టిన జీడిపప్పులు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఉప్పు మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి దీన్ని పల్చగా చేసుకోవాలి. ఇందాక ఉడికించుకున్న మొక్కల మీద వేసి కలుపుకుంటే మిక్ట్స్వెజ్ రోల్స్‌తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.