కావలసిన పదార్థాలు
కందగడ్డలు: అరకిలో, నెయ్యి: పావు కప్పు, పాలు: ఒక కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, చక్కెర: అర కప్పు, జీడిపప్పు, బాదం పప్పు: నాలుగు చొప్పున.
తయారీ విధానం:
కందగడ్డలను ఉడకబెట్టి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక కందగడ్డ మిశ్రమం వేసి సన్నని మంటపై వేయించాలి. పాలు, యాలకుల పొడి, చక్కెర వేసి కలుపుతూ బాగా దగ్గరపడేలా ఉడికించాలి. పైనుంచి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకుంటే ఘుమఘుమలాడే కందగడ్డ హల్వా సిద్ధం.