కావలసిన పదార్థాలు
చికెన్: అరకిలో (బోన్‌లెస్), కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, గుడ్డు: ఒకటి, చిల్లీఫ్లేక్స్: ఒక టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్: ఒక కప్పు, కారం: ఒక టీస్పూన్, ఉప్పు: తగినంత, సోయాసాస్: ఒక టీస్పూన్, వెనిగర్: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఆరిగానో: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను గంటపాటు ఉప్పునీటిలో నానబెట్టాలి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, గుడ్డు, ఉప్పు, చిల్లీఫ్లేక్స్, ఆరిగానో, మిరియాల పొడి, సోయాసాస్, వెనిగర్, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక ప్లేట్లో బ్రెడ్‌క్రంబ్స్, కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కల్ని బ్రెడ్‌క్రంబ్స్‌లో దొర్లించాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి.. బాగా వేడయ్యాక చికెన్ ముక్కల్ని విడివిడిగా, దోరదోరగా కాల్చుకుంటే చికెన్ పాప్‌కార్న్ సిద్ధం. టమాట సాస్‌తో బాగుంటాయి.