Bukhari Pulao Recipe | బుఖారీ పులావ్ తయారీ విధానం
Bukhari Pulao Recipe | బుఖారీ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం: అర కిలో, మటన్: అర కిలో, క్యారెట్ తురుము: ఒక కప్పు, పచ్చి బఠాణీ: అర కప్పు, టమాట ముక్కలు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, జీడిపప్పు: పావుకప్పు, కిస్మిస్: ఒక టేబుల్ స్పూన్, అక్రోట్స్: ఐదు, నూనె: అర కప్పు, కారం: ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, పసుపు: ఒక టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క: రెండంగుళాల ముక్క, సాజీర: అర టీస్పూన్, యాలకులు: నాలుగు, లవంగాలు: ఆరు, అనాస పువ్వు: ఒకటి, ఉప్పు: తగినంత.
Bukhari Pulao Recipe | బుఖారీ పులావ్ తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంటపాటు నానబెట్టుకుని పొడిపొడిగా వండాలి. స్టవ్‌మీద కుక్కర్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, అక్రోట్స్, కిస్మిస్ జోడించి బాగా వేయించి పక్కన పెట్టాలి. అదే నెయ్యిలో నూనె వేసి దాల్చిన చెక్క, సాజీర, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు వేయాలి. కాసేపు వేగాక తరిగిన ఉల్లిగడ్డ, మిర్చి, టమాట కలపాలి. అన్నీ బాగా వేగాక మటన్ వేయాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, క్యారెట్ తురుము, పచ్చిబఠాణీ, తగినంత ఉప్పు వేసి పది నిమిషాలు సన్నటి మంటపై మగ్గనివ్వాలి. అర లీటర్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. బాగా ఉడికిన మటన్‌లో.. ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కలిపి పైనుంచి వేయించిన డ్రైఫ్రూట్స్, నెయ్యి వేసి మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే నోరూరించే బుఖారీ పులావ్ సిద్ధం.
Read More :
“Egg Karam Dosa Recipe | ఎగ్ కారం దోసె తయారీ విధానం”
Pakam Garelu Recipe | పాకం గారెలు తయారీ విధానం
Noodles Momos Recipe | నూడుల్స్ మోమోస్ తయారీ విధానం
Mango Falooda Recipe | మ్యాంగో ఫాలూదా తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

