పొన్నగంటి కూర: కట్ట
పాలకూర: కట్ట
పచ్చిమిరపకాయలు: మూడు
శనగపిండి: కప్పు
బియ్యప్పిండి: కప్పు
జీలకర్ర: అరస్పూను
అల్లం: రెండంగుళాల ముక్క
ధనియాలు: అరస్పూను
సోడా ఉప్పు: పావు కప్పు
నూనె: పెద్ద కప్పుడు (వేయించడానికి సరిపడా)
ఉప్పు: రుచికి తగినంత
ముందుగా పొన్నగంటి కూరను ఒలుచుకొని గిన్నెలో వేసి కడగాలి. పాలకూరను కూడా శుభ్రంగా కడిగాక, రెండు ఆకుకూరల్ని సన్నటి ముక్కలుగా తరిగి గిన్నెలో వేసుకోవాలి. పచ్చి మిరపకాయల్ని కూడా చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. చిన్న రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని అల్లంతో పాటు ధనియాలు, జీలకర్రలను కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆకుకూరలతో పాటు, బియ్యప్పిండి, శనగపిండి, దంచిన మిశ్రమం, సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
దీనికి సోడా ఉప్పు కూడా జోడించడం వల్ల వంటకం బాగా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాగనివ్వాలి. ఇందాక కలిపిన పిండితో నూనెలో అచ్చం పకోడీల్లా వేసుకుని, బంగారు రంగు వచ్చాక తీసుకుంటే హరాభరా కబాబ్స్ రెడీ!