కావలసిన పదార్థాలు
చేప ముక్కలు (చర్మం, ముళ్లు తీసి నిలువుగా, సన్నగా కోసినవి): ఒక కప్పు, గుడ్లు: రెండు, మైదా: పావు కప్పు, బ్రెడ్ క్రంబ్స్: అర కప్పు, చిన్నగా తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి: అర టీస్పూన్ చొప్పున, ఆవాల పేస్ట్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి: అర టీస్పూన్ చొప్పున, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత చేప ముక్కల్లో గుడ్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్, రెడ్‌చిల్లీ ఫ్లేక్స్, మైదా వేసి బాగా కలిపి మరో అరగంటపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. ఒక ప్లేటులో బ్రెడ్ క్రంబ్స్ వేసి దాంట్లో ఒక్కో చేప ముక్కనూ బాగా దొర్లించి, కాగిన నూనెలో దోరగా కాల్చుకుంటే ఫిష్ ఫింగర్స్ సిద్ధం. ఇంకెందుకు ఆలస్యం?