కావలసిన పదార్థాలు
గుడ్లు: ఐదు, కార్న్‌ఫ్లోర్: ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి: రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి: ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్: పావు టీస్పూన్, డార్క్ సోయా సాస్: ఒక టీస్పూన్, టమాట కెచప్: ఒక టేబుల్ స్పూన్, అజినమోటో: అర టీస్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: రెండు, తరిగిన ఉల్లికాడలు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించ
డానికి సరిపడా, అల్లం: అంగుళం ముక్క, వెల్లుల్లి: నాలుగు రెబ్బలు, చక్కెర: అర టీస్పూన్, తెల్లమిరియాల పొడి: అర టీస్పూన్, వెనిగర్/ నిమ్మరసం: ఒక టీస్పూన్.
తయారీ విధానం
నాలుగు గుడ్లను ఉడకబెట్టి నిలువునా నాలుగు ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఒక గుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు, పావు టీస్పూన్ మిరియాలపొడి, మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి ఉడికించిన గుడ్డు ముక్కలను పిండి మిశ్రమంలో ముంచి, విడివిడిగా నూనెలో వేసి దోరగా కాల్చుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా వేగాక.. మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, సోయాసాస్, టమాట కెచప్, చిల్లీ పేస్ట్, అజినమోటో, తెల్లమిరియాల పొడి, వెనిగర్ వేసి అర కప్పు నీళ్లుపోసి బాగా ఉడికించాలి. ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగా వేయించిన గుడ్డు ముక్కలను వేసి బాగా కలిపి పైనుంచి ఉల్లికాడల తురుము వేసుకుంటే వేడివేడి ఎగ్ మంచూరియా సిద్ధం.