వెన్న లేదా బటర్: 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు: 5 లేక 6
గోధుమ పిండి: 1 టేబుల్ స్పూన్
పాలు: పావుకప్పు
చీజ్: మోస్తరు ముక్క
పావ్: నాలుగు
స్పైరల్ పాస్తా: 1 కప్పు క్యారట్, బీన్స్, క్యాప్సికమ్,
బచ్చలికూర: అన్నీ సమపాళ్లలో ఉండేలా ఒక పెద్ద కప్పు
ఉప్పు: తగినంత
ముందుగా సాస్ తయారు చేసుకోవడం కోసం వెల్లుల్ని రెబ్బల్ని సన్నగా తరిగి, బాణట్లో కొద్దిగా వెన్నపూస వేసి వేయించాలి. తర్వాత గోధుమ పిండి వేసి పాలుపోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత చీజ్‌ను తురిమి దీనికి కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. తర్వాత మరో బాణలిలో కొద్దిగా వెన్న లేదా బటర్ వేసి బచ్చలికూర, మిగతా కూరగాయల ముక్కల్ని హై ఫ్లేమ్‌లో ఉడికించాలి.
పాస్తాను ఉడికించి ఈ కూరగాయ ముక్కల్ని వేసి ఉప్పు కలపాలి. దీనికి సాస్నూ జోడించాలి. పావ్‌ను సగానికి కోసి వెన్నపూసి కాల్చిన బ్రెడ్‌కు జతగా దీన్ని వడ్డిస్తే వారెవ్వా అనిపించే క్రీమీ పావ్ పాస్తా రెడీ!
– ఎం.బాలరాయుడు పాకశాస్త్ర నిపుణురాలు