జాంబి రెడ్డి సీక్వెల్ పనులు షురూ.. మరింత భారీగా పార్ట్ 2
తేజ సజ్జ హీరోగా పరిచయమైన జాంబి రెడ్డి మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ కూడా చేస్తానని అప్పుడే ప్రకటించాడు ప్రశాంత్.

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతికొద్దిమంది విలక్షణ దర్శకులలో ప్రశాంత్ వర్మ కూడా ఒకడు. కమర్షియల్ సినిమాలు చేయడం కంటే కూడా కాస్త ఎక్కువ కాలం గుర్తుండిపోయే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు ప్రశాంత్ వర్మ. అలా తొలి సినిమా అ..! తోనే రెండు నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్నాడు ఈయన. ఆ తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ తో తెరకెక్కించిన కల్కి సినిమా కూడా పర్లేదు అనిపించింది.
ఈ మధ్య కరోనా వైరస్ నేపథ్యంలో తెలుగులో తొలి సినిమా జాంబీ రెడ్డి తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జాంబి రెడ్డి. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ కూడా చేస్తానని అప్పుడే ప్రకటించాడు ప్రశాంత్. దీనికి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలైపోయాయి. జాంబీ రెడ్డి సీక్వెల్ మరింత భారీగా ఉండబోతుందని తెలిపారు ప్రశాంత్ వర్మ. బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టబోతున్నారు.
తొలిభాగం మంచి విజయం సాధించడంతో ఆ నమ్మకంతోనే రెండో భాగానికి కూడా భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమాలో కూడా తేజ హీరోగా నటించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం కరోనా రెండో దశ నడుస్తున్న నేపథ్యంలో త్వరలోనే జాంబి రెడ్డి సీక్వెల్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తానని అంటున్నాడు ఈ దర్శకుడు. మరి ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్‌తో మూవీ పక్కా అంటున్న బండ్ల గణేష్..!
ఆదిపురుష్ బడ్జెట్‌పై ప్రభాస్ జాగ్రత్తలు
అందరిలానే నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి: శృతి హాసన్
కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఇళయరాజా సోదరుడి సతీమణి కన్నుమూత
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్
అమ్మకు పాజిటివ్ అంటూ ఎమోషనల్ అయిన బిగ్ బాస్ విన్నర్
సోషల్ మీడియాలో రత్తాలు రచ్చ.. మండిపడుతున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

