ఇటీవల ఏపీ ప్రభుత్వం కళారంగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవన సాఫల్య పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాన్ని కళాతపస్వి కే విశ్వనాథ్, నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తిలకు ప్రకటించారు. ఈ అవార్డ్ దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్. నారాయణమూర్తి. ఆయన మాట్లాడుతూ…‘కళాతపస్వి కే విశ్వనాథ్ గారితో పాటు నాకు వైఎస్. రాజశేఖర రెడ్డి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉంది. నన్ను అవార్డ్కు ఎంపికచేసిన సీఎం వైఎస్ జగన్, ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రజా కోణంలో మరిన్ని చిత్రాలు రూపొందించి, నటిస్తాను’ అన్నారు.