Tere Ishq Mein Pre release Event | ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishq Mein). ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గోంది. అయితే ఈ వేడుకలో నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పదే పదే ప్రేమలో ఓడిపోయిన పాత్రలే నాకు ఎందుకు ఇస్తారని ఈ సినిమా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌ని అడిగాను. అయితే ఆనంద్ నాకు సమాధానమిస్తూ.. మీది ‘గ్రేట్ లవ్ ఫెయిల్యూర్ ఫేస్’ (Great Love Failure Face) అని అన్నాడు. దీంతో నేను షాక్ అయ్యి ఇంటికి వెళ్లగానే నా ముఖాన్ని అద్దంలో పదే పదే చూసుకున్నాను. అయితే దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. కాంప్లీమెంట్గానే తీసుకున్నానంటూ ధనుష్ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Dhanush : I asked the director “why you keep calling me for roles like these..?” He said,”You have a Great love failure face..”😃 That day I went back & kept looking at my face in the mirror.. But I take it as a compliment..🤝pic.twitter.com/3GlnA2BiL0
— Laxmi Kanth (@iammoviebuff007) November 22, 2025