ఫిరోజ్‌ఖాన్, సనాఖాన్ ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం ‘యుఆర్మై హీరో’. షేర్ దర్శకుడు. మిన్ని నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ చిత్ర సమర్పకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రతినాయకుడు మిలింద్ గునాజీలు విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ ‘హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారిని అలరించే అంశాలున్నాయి. ఈ నెల 17న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మాఫియాను అంతం చేసే క్రమంలో చనిపోయిన హీరో, హీరోయిన్లు దెయ్యాలుగా మారి తమను చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేది చిత్రంలో ఆసక్తికరంగా వుంటుందని దర్శకుడు తెలిపారు.