Yatra 2 | బాక్సాఫీస్ వద్ద త్వరలో సందడి చేయబోతున్న పొలిటికల్ జోనర్ ప్రాజెక్టు యాత్ర 2 (Yatra 2). ఏపీ (పూర్వ ఆంధ్రప్రదేశ్) దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర (Yatra) చిత్రానికి కొనసాగింపుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో సీక్వెల్గా వస్తోంది. మేకర్స్ యాత్ర 2 నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
మరోవైపు ఇటీవలే లాంఛ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తండ్రీకొడుకులు మిలియన్ల సంఖ్యలో జనాల మనసులో ఎలాంటి చెరగని ముద్రవేసుకున్నారో తెలిపే ప్రయాణం నేపథ్యంలో సాగే చూడు నాన వీడియో సాంగ్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా తొలి సమరం పాటను లాంఛ్ చేశారు. క్యాంపెయిన్ నేపథ్యంలో వచ్చే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ పాడాడు.
మహి వి రాఘవ్ (Mahi V Raghav) వస్తోన్న యాత్ర 2 థియేటర్లలో ఫిబ్రవరి 8న గ్రాండ్గా విడుదలవుతుంది. ప్రజా సంక్షేమం కోసం తండ్రి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ చేసిన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకున్నారనే నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఏదో ఒక న్యూస్ అందిస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. యాత్ర 2 కేవలం తండ్రీకొడుకుల జర్నీ నేపథ్యంలోనే సినిమా ఉండబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. యాత్ర 2ను Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
తొలి సమరం లిరికల్ వీడియో సాంగ్..
Unleashing The Leader’s Battle for his People! ✊🏻💥#Yatra2 Second Single #TholiSamaram is Out Now! 🎶
A @Music_Santhosh Musical 🎹
🎙@gowthambharadwj
✍🏻@ramjowrites🎬 #Yatra2OnFeb8th#LegacyLivesOn @mammukka @JiivaOfficial @ShivaMeka @MahiVraghav… pic.twitter.com/9I4W0l1fFr
— Saregama South (@saregamasouth) January 30, 2024