Yatra 2 | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో యాత్ర (Yatra) చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన పొలిటికల్ జోనర్ ప్రాజెక్టు యాత్ర 2 (Yatra 2). కోలీవుడ్ నటుడు జీవా, మాలీవుడ్ స్టార్ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో మహి వి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కించిన యాత్ర 2 థియేటర్లలో ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
ఇప్పటికే ఏప్రిల్‌లో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటోంది. కాగా ఇప్పుడు మరో డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. యాత్ర 2ను మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మేకర్స్ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించారు . ఈ చిత్రంలో కేతకి నారాయణ్, సుజాన్నే బెర్నెర్ట్, మహేశ్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషించారు.
యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ప్రతీ ఒక్కటి సినిమాపై అంచనాలు పెంచి.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని Three Autumn Leaves, V Celluloid సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
మేం ఉన్నాం, మేం విన్నాం..♟️
యాత్ర 2 మీకోసం తీసుకొస్తున్నాం!🎥👉 ▶️https://t.co/4VTAeZeSe6@JiivaOfficial @mammukka #Yatra2 pic.twitter.com/c7D4BuOb6L— ahavideoin (@ahavideoIN) June 3, 2024