‘కేజీఎఫ్’ఫేం యష్ నటిస్తున్న పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె.నారాయణతో కలిసి యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్ట్‌గా కన్నడంతోపాటు ఇంగ్లిష్ భాషలో కూడా ‘టాక్సిక్’ రూపొందుతున్నది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పర్వదినాలను పురస్కరించుకొని వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ భారతీయ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని, అంతర్జాతీయ సినిమారంగంలో అనుభవం, ప్రతిభ ఉన్న వారందరినీ ఈ సినిమా ఒకేచోట చేర్చనున్నదని, హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతోపాటు ఇతర భాషల్లో కూడా ‘టాక్సిక్’ అనువాదం కానున్నదని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. మంటలు, చుట్టూ ఉన్న పొగ మధ్య హీరోను చూపించిన తీరు, ఆ గన్ పట్టుకునే విధానం, హీరో పెట్టుకొని టోపీ ఇవన్నీ పోస్టర్లో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నాయి.