“యశోద’ చిత్రంలో నెగెటివ్ ఛాయలున్న పాత్రను పోషించా. కథాగమనంలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని చెప్పింది వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆమె కీలక పాత్రలో నటించిన ‘యశోద’ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. హరి-హరీష్ దర్శకులు. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు ఎంత గొప్పగా రాశారో అనిపించింది. ఇందులో నేను సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్ పాత్రలో కనిపిస్తా. కథానాయిక సమంతతో సమాంతరంగా నా పాత్ర సాగుతుంది. నేను సెకండ్‌లీడ్‌లో నటించానుకోవచ్చు. ఈ సినిమాలోని మహిళా పాత్రల్ని ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుంటారు. క్యారెక్టర్స్ కంటే కథే నా ఫేవరేట్‌గా ఫీలయ్యాను’ అని చెప్పింది.