Samantha’s Yashoda | వినూత్న కథలను ఎంచుకుంటూ వైవిధ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈమె నటించిన ‘కతు వాకుల రెండు కాదల్’ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈమె తెలుగులో మూడు సినిమాలలో నటిస్తుంది. అందులో ‘యశోద’ ఒకటి. హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ గతేడాది ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా చిత్రబృందం ఒక బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
‘యశోద’ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే5 ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్టు 12న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది.
Team #Yashoda wishes #EidMubarak 😇
Stay tuned for First glimpse on May 5th, 11:07AM🔥#YashodaTheMovie @Samanthaprabhu2 @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan #ManiSharma @mynnasukumar @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/kSFlwdBKsB
— Sridevi Movies (@SrideviMovieOff) May 3, 2022