Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 12 వారాలుగా అలరిస్తున్న ఈ షో మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షోకి సంబంధించి ఆదివారం వస్తుందంటే చాలు ప్రేక్షకులు టెన్షన్‌తో టీవీలకు అతుక్కుపోతారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్కతో పాటు, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్ తదితరులు ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఇంతకుముందు ఉన్న వారాలతో పోల్చుకుంటే ఈ వారం ఎలిమినేషన్ చాలా భిన్నంగా జరిగింది. గతంలో హౌజ్ నుంచి వెళ్లిపోయిన సభ్యులు వచ్చి హౌజ్‌లో ఉన్నవారిని ఈ వారం నామినేట్ చేశారు. ఇక నామినేషన్స్‌లో ఉంది ఎవరు చూసుకుంటే.. నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ.. ఉన్నారు. ఇందులో ఈ వారం తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్లో ఉంది యష్మీ గౌడ. దీంతో ఈ వారం హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది యష్మీ గౌడ అని వార్తలు వస్తున్నాయి. హౌజ్‌లోకి వచ్చిన ఫస్ట్ డే నుంచి తన ఆటతో ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక 12 వారాలు టైటిల్ విన్నర్‌కి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన ఈ భామ తక్కువ ఓటింగ్‌తో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాలి అంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.