ఒకప్పుడు కన్నడ సినిమాకు మాత్రమే పరిమితమైన హీరో.. ఇపుడు పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వివిధ రంగాల్లో సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యేంతలా స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ఇంతకీ అతడెవరో ఇప్పటికే గుర్తొచ్చి ఉంటుంది. కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినిమా రూపురేఖలు మార్చేసిన హీరో యశ్ (Yash). కేజీఎఫ్ 2తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో చెప్పడం కొంత కష్టమే.
అయితే నెక్ట్స్ సినిమా ఏంటో ప్రకటించకపోవడంతో కొంచెం నిరాశలో ఉన్నారు యశ్ అభిమానులు. వారి కోసం ఓ స్టన్నింగ్ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సోదరుడు క్రునాల్ ప్యాండా (Krunal Pandya) కేజీఎఫ్ హీరో యశ్‌తో ఫొటో దిగారు. ఈ స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. అంతేకాదు కేజీఎఫ్ 3 అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు అభిమానులు, ఫాలోవర్లు క్రేజీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
పవర్ బ్యాంక్స్ అన్నీ ఒకే ఫ్రేమ్‌లో.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సీఈవో ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ.. యశ్ అభిమానులు నాలాగే.. రాఖీ భాయ్ ఫ్రం కర్ణాటక అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగానైనా యశ్ నుంచి కొత్త సినిమా అప్డేట్ ఏదైనా వస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. బర్త్ డేకు మరో వారం రోజులే ఉండటంతో ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
కేజీఎఫ్ 3 క్యాప్షన్‌తో వైరల్ అవుతున్న ఫొటో..