చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం, హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు యష్ పూరి. తాజాగా విడుదలైన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో ఆయన కీలక పాత్రను పోషించారు. సమంత, వరుణ్‌ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో యష్ పూరి మాట్లాడుతూ ‘ఈ సిరీస్ నా కెరీర్‌ను మరో మెట్టెక్కించింది. సమంత, వరుణ్‌ధావన్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ఈ సిరీస్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉంది. ‘సిటాడెల్: హనీ బన్నీ’ నా కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’ అన్నారు.