త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని దర్శకుడు. అరవింద్ మండెం నిర్మాత. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రచారం వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని కీలకమైన పాటని మేకర్స్ విడుదల చేశారు. అర్వింద్ మండెం రాసిన ఈ పాటను ప్రకాశ్ చెరుకూరి స్వరపరచగా, బాబా సెహగల్ తనదైన జోష్తో ఆలపించారు. వ్యవసాయం ప్రాముఖ్యత, మట్టివాసన గొప్పతనం, ఆధునిక టెక్నాలజీ ఆవశ్యకత.. వీటన్నింటినీ మిళితం చేస్తూ ఈ పాట సాహిత్యం సాగింది. యువతతోపాటు అన్ని వర్గాలకూ ఈ పాట కనెక్ట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శివాజీరాజా, హర్షవర్ధన్, సత్యకృష్ణన్, హర్ష చెముడు, నెల్లూరు సుదర్శన్, సివిఎల్ నరసింహారావు, గుండు సుదర్శన్, వేణు యల్దెండి, సప్తగిరి, గిరిధర్, సరయు, సత్తిపండు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్.వి, సమర్పణ: సి.హెచ్,వి.ఎస్.ఎన్.బాబ్జీ, నిర్మాణం: లోటస్ క్రియేటివ్ వర్క్స్.