Yamadonga | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి కాంబోలో వచ్చిన చిత్రం ‘యమదొంగ’. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా మోహన్ బాబు, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. సోషియో ఫాంటసీ మూవీగా వచ్చిన యమదొంగ అప్పట్లో ఎన్నో సంచలనాలు సృష్టించి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాంటి ఈ ఐకానిక్ మూవీని ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా మే 18న రీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఈ చిత్రాన్ని చూసేందుకు బారులు తీరారు. ఇక థియేటర్ దగ్గర తెగ రచ్చ చేశారు.
అయితే ఈ మధ్య అభిమానులు రీరిలీజ్ సమయంలో సినిమాలో నటుడి గెటప్ వేసుకొని థియేటర్ దగ్గరకి వచ్చి హంగామా చేస్తున్నారు. ఇటీవల జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ అయితే.. ఓ వ్యక్తి ఏకంగా అమ్రిష్ పురి గెటప్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక ఇప్పుడు యమదొంగలో అలీ వేసిన వింత గెటప్‌లో ఓ అభిమాని థియేటర్‌కి వచ్చి హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇంకొందరు అయితే ఎన్టీఆర్ గెటప్ మాదిరిగా రెడీ అయి రాగా, ఇంకొందరు మోహన్ బాబు గెటప్‌లో వచ్చారు. వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
యమదొంగ రీరిలీజ్ మిగిలిన సినిమాల కంటే భిన్నమైంది అనే చెప్పాలి. దీని కోసం చిత్ర యూనిట్ చాలానే కష్టపడింది. సినిమా మొత్తాన్ని 8కెలో స్కాన్ చేసి తర్వాత దాన్ని 4కె కు కుదించి ఆడియన్స్ కు మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా రీరిలీజ్‌కి సంబంధించి ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తునే జరిగాయి. హీరోయిన్లు ప్రియమణి, మమతా మోహన్‌దాస్ షూటింగ్ టైమ్ లోని అనుభవాలను షేర్ చేసుకుంటూ వీడియోలను రిలీజ్ చేయగా అవి కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా స్లిమ్‌గా కనిపించి ఆశ్చర్యపరిచారు.
#Yamadonga4K Ali Scene Recreated at Vizag melody Theatre 🔥🔥 pic.twitter.com/VRChvZnFZu
— Nellore NTR Fans (@NelloreNTRfc) May 18, 2025