సుమన్‌శెట్టి, జబర్దస్త్ అప్పారావు, పొట్టి చిట్టిబాబు, గోవా జ్యోతి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. చిలుకోటి రఘురామ్ నిర్మాత. ఈ సినిమా పాటలను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, చంటి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని, అన్ని వర్గాలకూ నచ్చే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు.