ఆస్కార్ వేదికపై క్రిస్ రాక్‌ను కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్ స్మిత్..
లాస్ ఏంజిల్స్: ఈ యేటి ఉత్తమ నటుడు విల్ స్మిత్.. ఆస్కార్స్ వేదికపై హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. అవార్డు ప్రధానోత్సవ సమయంలో భార్య జేడా పింకెట్ స్మిత్‌పై అనుచిత కామెంట్ చేసిన నేపథ్యంలో స్టేజ్ మీదకు వెళ్లి రాక్‌ను కొట్టాడు. వేడుకల కోసం వచ్చిన పింకెట్ స్మిత్.. తలకు గుండు గీసుకుని వచ్చింది. రెడ్ కార్పెట్‌లో పింకెట్, విల్లో డిఫరెంట్‌గా అట్రాక్ట్ చేశారు. అయితే స్టేజ్‌పై పింకెట్‌ను ఉద్దేశిస్తూ క్రిస్ రాక్ కామెంట్ చేశారు. జీఐ జేన్ 2 ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నట్లు రాక్ అన్నాడు. ఆ సమయంలో స్టేజ్ మీదకు వెళ్లిన విల్ స్మిత్ .. హోస్ట్ రాక్‌పై చేయి చేసుకున్నాడు. తన భార్య పేరును పలకవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన లైవ్‌లో ప్రసారం జరిగింది. అయితే విల్ స్మిత్ నిజంగా కోపంతో కొట్టాడా లేక ఆ ఈవెంట్లో ఇదో స్టంటా అన్నది స్పష్టం కాలేదు.
#badboys3 #gijane2 #willsmith #chrisrock #oscars #besttvever
Can't believe what I just saw live on screen pic.twitter.com/YiijPRQENt
— Guy (@GuySpringthorpe) March 28, 2022
ఆస్కార్ అవార్డుల్లో.. విల్ స్మిత్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. కింగ్ రిచర్డ్ చిత్రంలో టెన్నిస్ స్టార్లు వీనస్, సెరీనా విలియమ్స్‌కు తండ్రి పాత్రలో నటించాడు. మేటి నటనతో ఆకట్టుకున్న విల్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న సమయంలో.. రాక్‌ను కొట్టిన ఘటనపై క్షమాపణలు చెప్పారు. అకాడమీకి క్షమాపణలు చెబుతున్నానని, అవార్డుకు నామినేట్ అయినవారికి కూడా తన క్షమాపణలు అని పేర్కొన్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ ప్రైజ్‌ను ప్రజెంట్ చేసేందుకు క్రిస్ రాక్ స్టేజ్‌మీదకు వచ్చినప్పుడు విల్ అతన్ని కొట్టాడు. అయితే 1997లో రిలీజైన జీఐ జేన్ చిత్రంలోని డెమీ మూర్‌ను దృష్టిలో పెట్టుకుని పింకెట్ స్మిత్‌పై రాక్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

