Samyuktha Menon | ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు గంపెడు అదృష్టం కూడా ఉండాలని పలువురు చెబుతుంటారు. అదృష్టం లేకపోతే అవకాశాలు సైతం గుమ్మం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్లిపోతాయట. కాగా కొందరి విషయంలో ఎంత కష్టపడ్డ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ కొందరి విషయంలో మాత్రం నక్క తోక తొక్కినట్లు అవకాశాలు బారులు తీస్తుంటాయి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకొచ్చుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. గతేడాది రిలీజైన ‘భీమ్లానాయక్’తో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ కుట్టి. తొలి సినిమాతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఎమోషనల్ సీన్లలో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్న విమర్శలు వచ్చినా.. మిగితా సీన్లలో మాత్రం ఇరగదీసిందని ప్రశంసలు కూడా పొందింది.
ఇక భీమ్లానాయక్ విడుదలైన అర్థ సంవత్సరంలోనే ‘బింబిసార’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సంయుక్త పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. స్క్రీన్‌పై కనిపించినంత సేపు సందడి చేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ‘సార్’ సినిమాలో టీచర్‌గా స్ట్రాంగ్ క్యారెక్టర్ పోషించింది. ఇక ఈ సినిమాలో లవ్ ట్రాక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధనుష్, సంయుక్త మీనన్ మధ్య సీన్లన్ని అదిరిపోయాయి. ఈ సినిమాతో ధనుష్‌కు తెలుగులో విపరీతమైన మార్కెట్ ఏర్పడింది. ఇక మరో వారం రోజుల్లో విడుదల కానున్న ‘విరూపాక్ష’లోనూ సంయుక్త హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లను చూస్తుంటే.. సంయుక్త క్యారెక్టర్ కీలకంగా కనిపిస్తుంది.
వీటితో పాటుగా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డెవిల్’ సినిమాలోనూ సంయుక్త హీరోయిన్గా నటిస్తుంది. బింబిసార తర్వాత రెండో సారి ఈ జోడీ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఇలా రెండేళ్లలోనే సంయుక్త పెద్ద పెద్ద సినిమాల్లో చాన్స్‌లు కొట్టేసింది. అయితే సంయుక్త ముఖంలో హావభావాలు సరిగ్గా పలకవన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇదొక్కటి సరి చేసుకుంటే సంయుక్త మీనన్ త్వరలోనే స్టార్ హీరోయిన్ అవడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.