ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతుండటంతో మెగా అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అయితే.. వాళ్ల ఆవేశం చల్లబడేలా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.
ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ ఐపీఎస్ అధికారిగా, ఐఏఎస్ అధికారిగా రెండు బాధ్యతల్లో కనిపిస్తారట. ఓకే సినిమాలో హీరో పోలీస్‌గా, కలెక్టర్‌గా కనిపించడం ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో జరగలేదని చెప్పొచ్చు. ఇంకా అభిమానుల ఊహకందని ఎన్నో విశేషాలతో దర్శకుడు శంకర్ ‘గేమ్‌ఛేంజర్’ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.