Bigg Boss Telugu 8 – Wildcard Entries | బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌తో పాటు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అదివారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వహాకులు తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రోమో చూస్తుంటే ఇప్పటికే 4 వారాలు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఈ వారం నుంచి మరింత ఎంటర్టైనమెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక హౌస్ ఎవరెవరు రాబోతున్నారు అనేది ప్రోమోలో సస్పెన్స్‌గా ఉంచాడు బిగ్ బాస్. అయితే వాయిస్‌తో హౌజ్‌లోకి హరితేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ నటి హరితేజ గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో కంటెస్ట్‌గా చేసి ఫైనల్లో 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ భామ ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనునట్లు ప్రోమో ద్వారా తెలుస్తుంది.
అయితే ఈ ప్రోమో మరో కంటెస్టెంట్ కనిపించింది. ఆమె ఎవరో కాదు. మై విలేజ్ షోతో యూట్యూబ్‌తో పాటు తెలంగాణ అంతటా అభిమానులను సంపాదించుకున్న గంగవ్వ మళ్లీ బిగ్ బాస్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె షోలోకి వస్తున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యి మధ్యలోనే వెళ్లిపోయింది గంగవ్వ. అయితే గంగవ్వ మళ్లీ వస్తుడటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా వీరే కాకుండా రోహిణి, ముక్కు అవినాష్, యాంకర్ రవి, గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.