Wild Cards in Bigg Boss | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదోవారంకు చేరుకుంది. గతవారం హౌజ్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. హౌస్‌మేట్స్‌తో ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఆమెను హౌస్ నుంచి బయటకు పంపిచేశాడు బిగ్ బాస్. అయితే ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్డేట్ ఇచ్చాడు.
హౌస్ నుంచి సోనియాను బయటకు పంపిన అనంతరం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు నాగార్జున. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తున్నాయి అంటూ సరికొత్త ప్రోమోను రిలీజ్ చేశాడు. అయితే ఈ ప్రోమో చూస్తే.. వైల్డ్ కార్డుల ద్వారా 8 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అయితే గత సీజన్లలో కంటెస్ట్ చేసిన వారినే ఇందులో వైల్డ్ కార్డు ద్వారా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో నలుగురు అబ్బాయిలు వుండగా వారికి జోడిగా నలుగురు అమ్మాయిలను ఉండనున్నట్లు సమాచారం. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే గత వారం ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల కూడా వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. ఇక ఈ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వారికి సంబంధించి ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది అందులో ఎవరెవరు ఉన్నారు అంటే.
హరితేజ – టాలీవుడ్ నటి హరితేజ గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో కంటెస్ట్‌గా చేసి ఫైనల్లో 3వ స్థానంలో నిలిచింది. అయితే ఈ భామ ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది.
రోహిణి: బీబీ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చిన రోహిణి.. తన మార్క్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. హౌస్ నుంచి నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లేడి మళ్లీ సీజన్ 8లో రానుందని సమాచారం. ఇక రీసెంట్గా వచ్చిన మత్తు వదలరా 2లో కీలక పాత్రలో నటించింది ఈ భామ.
ముక్కు అవినాష్ : బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా వచ్చాడు కమెడియన్ ముక్కు అవినాష్. ఆ సీజన్లోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి అంచనాలకు మించి రాణించాడు. అయితే ఇతడు కూడా సీజన్ 8లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
యాంకర్ రవి : సీజన్ 8 టాలీవుడ్ యాంకర్ రవి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ 5లో వచ్చిన రవి సరిగ్గా రాణించకపోగా అతడిపై అభిమానుల్లో తీవ్ర నెగిటివిటీ వచ్చేసింది. దీంతో కొన్నిరోజుల్లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అయితే రవి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇంకా వీళ్లే కాకుండా.. సీజన్ 7లో వచ్చిన గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, సీజన్ 8లో వచ్చిన సోనియా ఆకుల మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఆదివారం వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. మరోవైపు మిడ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై కూడా ఉత్కంఠ నెలకొంది.