L&T Chairman | పనిగంటలకు సంబంధించి ఎల్అండ్టీ చైర్మన్ (L&T Chairman) ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్అండ్టీ చైర్మన్ అన్నారు.
ఎల్అండ్టీ ఉద్యోగులతో ఇటీవల ఆన్లైన్లో సుబ్రహ్మణ్యన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంస్థలో వారానికి ఆరు రోజుల పని విధానాన్ని అమలు చేయడాన్ని ఓ ఉద్యోగి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. ‘ఆదివారాలు కూడా మీతో పని చేయించలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. మీతో ఆదివారాలు సైతం పని చేయిస్తే చాలా సంతోషపడతాను. ఎందుకంటే, నేను ఆదివారాలు కూడా పని చేస్తున్నాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటావు? ఎంతసేపు నీ భార్యను అలా తదేకంగా చూస్తూ ఉండగలవు? ఆఫీసుకు వెళ్లి పని చేయడం ప్రారంభించు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారాన్ని లేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై నటి దీపికా ఘటుగా స్పందించింది. ‘ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేయడం షాకింగ్‌గా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ ఘటనపై భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల(Jwala Gutta) ఎక్స్ వేదికగా స్పందించింది. ”ముందుగా.. భర్త తన భార్య ముఖాన్ని ఎందుకు చూడకూడదు. కేవలం ఆదివారం మాత్రమే తన భార్యను ఎందుకు చూడాలని అనుకుంటున్నాడు అంటూ ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ని ప్రశ్నించింది జ్వాల గుత్తా. బాగా చదువుకొని ఇలాంటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం చాలా బాధకరం. ఇలాంటి వారు మానసిక ఆరోగ్యాన్ని.. మానసిక విశ్రాంతిని సీరియస్‌గా తీసుకోకపోవడం.. అలాగే స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు బహిరంగంగా చేయడం చూస్తుంటే.. ఇది నిరాశతో పాటు భయంకరంగా కనిపిస్తుంది” అంటూ జ్వాల రాసుకోచ్చింది.
I mean…first of all why shouldn’t he stare at his wife…and why only on a Sunday!!!
its sad and sometimes unbelievable that such educated and people at highest positions of big organisations are not taking mental health and mental rest seriously…and making such misogynistic…— Gutta Jwala 💙 (@Guttajwala) January 10, 2025