Bigg boss OTT first elimination | బిగ్ బాస్ వస్తున్నపుడు దాని గురించి చర్చ కూడా ఎక్కువగానే జరుగుతుంది. సోషల్ మీడియాలోనూ దానిపై రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. మా వాడు సేఫ్ అవుతాడు.. మీ వాడు వెళ్లిపోతాడు అంటూ కామెంట్స్ చేస్తుంటారు అభిమానులు. అయితే బిగ్ బాస్ ఓటీటీ మొదలైనా కూడా బయట పెద్దగా ప్రభావం అయితే కనిపించడం లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ షోను బాగానే ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్ రావడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరగనుంది.
ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అయితే ఓటింగ్ పరంగా అరియానా ముందుంది. ఈమెకు 29 శాతం వరకూ ఓటింగ్ జరిగింది. తొలి వారంలోనే తన రేంజ్ చూపించింది అరియానా. ఈమెకు బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అరియానా తర్వాత ఆర్జే చైతూ ఉన్నాడు. ఈయనకు కూడా 14 శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ కుర్రాడు సేఫ్ జోన్లోనే ఉన్నాడు. మూడో స్థానంలో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు. ఈయన కూడా సేఫ్‌గానే ఉన్నాడు.
హమీదాకు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు. అందులో ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, సరయు. అయితే సరయు అప్పుడు కూడా మొదటి వారమే బయటికి వచ్చేసింది కాబట్టి ఈ సారి మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు ఆడియన్స్. దాంతో కచ్చితంగా ఈమె సేఫ్ అయ్యేలా కనిపిస్తుంది. ముమైత్ ఖాన్ కూడా పాపులర్ కాబట్టి ఆమెకు కూడా సేఫ్ అయ్యే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఎటొచ్చీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మిత్రా శర్మనే ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది. ఈమెకు చాలా తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ వారం ఎవరు బయటికి వస్తున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.