Bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు ఒక్కో వారం గడిచేకొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా అందరు కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే అందులో ఒకరిని సేవ్ చేసుకునే అవకాశం బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. దీనికోసం ఆయన ఒక టాస్క్ ఆడాలని సూచించాడు. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్లు సేవ్ అవుతారు. దీనికోసం బిగ్ బాస్ ఇచ్చే ఫైర్ స్టేషన్ టాస్క్‌లో ఫైనల్ వరకు ఎవరి ఫోటో కాలిపోకుండా ఉంటుందో వాళ్లే ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకుంటారు. ఈ ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఏదైనా వారం ఎలిమినేషన్ అవుతాం అనుకున్న టైంలో వాళ్లు ఎవిక్షన్ పాస్ ఉపయోగించి దాని నుంచి సేఫ్ అవ్వొచ్చు.
ఇక ముందే బయటకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈ ఎవిక్షన్ పాస్ కూడా సన్నీనే సొంతం చేసుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఇంట్లో ఉన్న అందరికంటే సన్నీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఎవిక్షన్ పాస్ లేకపోయినా కూడా ఆయన ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వడు. ఓటింగ్ పరంగా కూడా అందరికంటే ముందు దూసుకుపోతున్నాడు సన్నీ. అలాంటి ఆటగాడికి ఇప్పుడు ఈ పాస్ కూడా తోడయింది. ఇక ఈ వారం ఇంటి కెప్టెన్‌గా మానస్ నిలిచినట్లు తెలుస్తోంది. ప్రియాంక సింగ్, సిరి, ఆనీ మాస్టర్ తో ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీ పడ్డాడు మానస్. నలుగురికి రింగ్ ఇచ్చి ఎవరైతే దాన్ని చివరివరకు వదిలిపెట్టకుండా పట్టుకుంటారో వాళ్లే తదుపరి కెప్టెన్ అవుతారు. ఈ క్రమంలోనే మానస్ చివరి వరకు ఉన్నాడని తెలుస్తోంది. అలా ఆయన ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యాడని సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss: షణ్ముఖ్,నీ మధ్య ఏం నడుస్తుంది.. రవి ప్రశ్నకు సిగ్గుపడ్డ సిరి
Siri: షణ్ముఖ్‌కి దిష్టి తగులుతుందని రక్తంతో పూసలు కట్టిన సిరి
Nominations: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వారెవరు, సేవ్ అయిన వారెవరు ?
Bigg Boss:బిగ్ బాస్ 5 టైటిల్ గెలవాలంటూ శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ విషెస్
Siri: షణ్ముఖ్ కౌగిలిలో సిరి..ఇది ఎక్కడికి పోతుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్