యాక్టింగ్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్..ఇలా ఏ క్రాప్ట్కైనా పూర్తి స్థాయిలో న్యాయం చేసే హీరోయిన్లు చాలా కొద్ది మందే ఉంటారు. ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది కోలీవుడ్ (kollywood) భామ సాయిపల్లవి (Sai Pallavi). ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో దేవదాసి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఇటీవలే ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది సాయిపల్లవి. అయితే అప్పటి నుంచి మళ్లీ ఎక్కడా కనిపించకపోవడం..సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఏం లేకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో రానాతో కలిసి నటిస్తున్న విరాట పర్వం (Virata Parvam) మినహా మరే సినిమా లేదు. ఇంతకీ తమ అభిమాన హీరోయిన్ హఠాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయిందోనని తెగ చెవులు కొరుక్కుంటున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు, మూవీ లవర్స్. ఇంతకీ ఆమె ఎక్కడుంది..నెక్ట్స్ ఏ సినిమా చేస్తోందని తెలుసుకోవాలని చూస్తున్న అభిమానులకు సాయిపల్లవి ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి తక్కువ కాలంలోనే కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. గతేడాది సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.