Sujeeth sign and Sachin | పవన్ కళ్యాణ్‌తో ఓజీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు దర్శకుడు సుజిత్. ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే సుజిత్ మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరూ కలిసి ఒక యాడ్ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యాడ్‌లో సచిన్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. సుజిత్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. సినిమాల విషయానికి వస్తే.. సుజిత్ ప్రస్తుతం నానితో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం బ్లడీ రోమియో అనే టైటిల్‌తో రాబోతున్నట్లు సమాచారం. నాని సరసన పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.
Straight from the sets of @TechnopaintsS ✨
Where colors meet creativity, featuring the OG Cricketer of India @sachin_rt and directed by @Sujeethsign! ❤️🔥 pic.twitter.com/jp15LFtAjA
— Sujeeth Rampage FC (@Sujeethfanpage) November 7, 2025