శృతి మించిన అభిమానం వల్ల చాలామంది స్టార్లు ఇబ్బందులు పడ్డ సందర్భాలు దేశంలో కోకొల్లలు. ఒకప్పుటి బాలీవుడ్ సూపర్‌స్టార్ రాజేష్‌ఖన్నా కారును లేడీ ఫ్యాన్స్ ముద్దులతో ముంచెత్తేవారట. ఆ కారు టైర్ గుర్తులున్న మట్టిని తీసి బొట్టు పెట్టుకునేవారట. కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ అగ్రహీరో రణ్‌బీర్ కపూర్‌కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ‘నాకు ఫస్ట్‌నుంచీ లేడీ ఫ్యాన్స్ కాస్త ఎక్కువే. కెరీర్ తొలినాళ్లలో ఓ మహిళా అభిమాని.. రోజూ మా ఇంటి ముందుకొచ్చి నిలబడేదట. ఓ రోజు నేను ఇంట్లో లేని సమయం చూసి, ఓ పురోహితుడ్ని తీసుకొచ్చి మా ఇంటి గేట్‌ని పెళ్లి చేసేసుకుందట. గేట్‌కు పువ్వులు, బొట్టు పెట్టింది. నేను ఊరు నుంచి రాగానే ఈ విషయాన్ని మా వాచ్‌మ్యాన్ నాకు చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోయాను. ఓ విధంగా చూసుకుంటే ఆమె నా మొదటిభార్య. అయితే నేను ఇప్పటివరకూ ఆమెను చూడలేదు. తనను కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్న’ అని సరదాగా చెప్పుకొచ్చారు రణ్‌బీర్.