ఆడియన్స్ వచ్చేనా..హాలు నిండేనా.. జూలై 30న అగ్ని పరీక్ష
కరోనా వైరస్ ప్రేక్షకులనే కాదు ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మొదటి దశ ఏమో కానీ రెండో దశ మాత్రం నిజంగానే అందరికీ ముచ్చెమటలు పట్టించింది.

కరోనా వైరస్ ప్రేక్షకులనే కాదు ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మొదటి దశ ఏమో కానీ రెండో దశ మాత్రం నిజంగానే అందరికీ ముచ్చెమటలు పట్టించింది. ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత అంతా విచ్చలవిడిగా రెచ్చిపోయారు. మాస్కులు తీసేసి బయటకి వచ్చేసారు. దాంతో సెకండ్ వేవ్ ఎవరూ కలలో కూడా ఊహించని స్థాయిలో విరుచుకుపడింది. బయట మాత్రమే కాదు..సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందిని తీసుకెళ్లిపోయింది కరోనా మహమ్మారి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదలైన తర్వాత.. రెండు వారాలకు థియేటర్స్ మూసేసారు. అప్పట్నుంచి తెరవద్దు అని ఏ గవర్నమెంట్ చెప్పలేదు కానీ ఎగ్జిబిటర్లు మాత్రం థియేటర్స్ ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు.
సినిమాలు లేకుండా ఓపెన్ చేసినా లాభం లేదని వాళ్ల అభిప్రాయం. అయితే జులై 30న చాలా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో ఒకటి రెండు మాత్రమే పేరున్న సినిమాలున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్ వరకు రావాలంటే అద్భుతాలు జరగాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలు వస్తే కానీ జనం థియేటర్స్ వైపు కన్నెత్తి కూడా చూసేలా లేరు. ఇలాంటి సమయంలో సత్యదేవ్ నటించిన తిమ్మరుసు..తేజ సజ్జ నటించిన ఇష్క్ సినిమాలు జులై 30న వస్తున్నాయి. ఈ కుర్ర హీరోల సినిమాలకు జనం థియేటర్ వరకు వస్తారా..? కరోనాను కూడా కాదనుకుని సిల్వర్ స్క్రీన్ వైపు చూస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ లో అయితే ఇప్పటికీ థియేటర్స్ ఓపెన్ చేయడం లేదు.. చేసినా కొత్త సినిమాలు విడుదల చేయడం లేదు. తమిళ ఇండస్ట్రీ కూడా దీనికి మినహాయింపు కాదు. నిజానికి ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత అత్యంత వేగంగా కోలుకున్నది తెలుగు ఇండస్ట్రీ మాత్రమే. జనవరి నుంచి ఏప్రిల్ గ్యాప్ లోనే మనకు క్రాక్, మాస్టర్, రెడ్, ఉప్పెన, నాందీ, జాతి రత్నాలు, వకీల్ సాబ్ లాంటి విజయాలు వచ్చాయి. మరే ఇండస్ట్రీకి సాధ్యం కాని రీతిలో మనోళ్లు కుమ్మేసారు. ఇప్పుడు కూడా ఇదే నమ్మకంతో సినిమాలను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే సెకండ్ వేవ్ చేసిన దారుణాలు చూసిన తర్వాత థియేటర్స్ వరకు ప్రేక్షకులు కదులుతారా..? లేదా..? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

